విజయ్ దేవరకొండ మూవీలో తమిళ్ హీరోయిన్

106
vijay devarakonda Vani bhojan

యూత్ సెస్సెషన్ విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, ట్యాక్సివాలా లాంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాతో తన కంటూ ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ఇటివలే నిర్మాతగా మారారు. ఆయనను మొదట హీరోగా పరిచయం చేసిన పెళ్లి చూపులు మూవీ దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు.

ఈసినిమాకు నూతన దర్శకుడు సమీర్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి ఈసినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు చిత్రయూనిట్. ఈమూవీలో తరుణ్ భాస్కర్ సరసన తమిళ టెలివిజన్ సంచలనం వాణి బోజన్ ను హీరోయిన్ గా తీసుకున్నారట. ఈవిషయాన్ని స్వయంగా ఆమెనె వెల్లడించింది.

తనకు ఈసినిమాలో అవకాశం ఇచ్చిన విజయ్ దేవరకొండకు ధన్యవాదాలు తెలిపింది వాణి. ఈసినిమా ద్వారా తాను తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నట్లు తెలిపింది. వాణి భోజన్ ఈసినిమాతో పాటు మరో రెండు తమిళ సినిమాల్లో నటిస్తుంది. త్వరలోనే ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుందని సమాచారం.