నెక్ట్స్‌ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దేవరకొండ..

68

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు.. యూత్‌లో ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అబ్బాయిలు .. అమ్మాయిలు ఆయన సినిమాలకి ఎగబడిపోతున్నారు. ఈ క్రేజ్ కారణంగా ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘డియర్ కామ్రేడ్’ సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. ఇక విజయ్‌తో తరువాత సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్‌ ఆయన్ని సంప్రదిస్తున్నారు.

Vijay Devarakonda

తాజాగా విజయ్‌తో సినిమా చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ బ్యానర్లో ఒక సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ సినిమాకి ‘హీరో’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారట. అయితే గతంలో చిరంజీవి కథానాయకుడిగా ‘హీరో’ టైటిల్‌తో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చిరంజీవి హీరోయిజాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. మరి విజయ్ దేవరకొండకి గల క్రేజ్‌ను ఈ సినిమా ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి.