పూరీతో విజయ్ దేవరకొండ కన్ఫామ్..

477
- Advertisement -

డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. సక్సెస్ పుల్ గా థియేటర్లలో నాలుగో వారం నడుస్తోంది. పూరీ కెరీర్ లోనే కాకుండా రామ్ కెరీర్ లో కూడా ఈసినిమా మంచి విజయాన్ని ఇచ్చింది. ఈసినిమా బాక్సాఫిస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది. దాదాపు రూ.80కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. పూరీ తన సొంత బ్యానర్ లో సినిమాను నిర్మించారు. ఇక ఈసినిమా తర్వాత పూరీ ఎవరితో చేస్తాడని ఎదరుచూస్తున్నారు అభిమానులు.

పూరీ తన తర్వాతి మూవీ సస్సెషనల్ హీరో విజయ్ దేవరకొండతో తీయనున్నాడని తెలుస్తుంది. కానీ వీరిద్దరి కాంబినేషన్ త్వరలోనే సినిమా రానుంది. పూరీ జగన్నాథ్, ఛార్మీ తో విజయ్ దేవరకొండ సెల్ఫీ దిగాడు. ఈవిషయాన్ని నిర్మాత ఛార్మీ తన ట్వీట్టర్ ద్వారా తెలిపింది.

మరికొద్ది రోజుల్లో ఈప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. పూరి దర్శకత్వం వహించే ఈ సినిమాకి ఆయనతో పాటు చార్మీ నిర్మాతగా వ్యవహరించనుంది. సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయంతో పాటు, ఇతర వివరాలను చిత్రయూనిట్ త్వరలోనే అధికారికంగా తెలుపనుంది.

Charmi Twitter

- Advertisement -