మారుతి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ!

193
Vijay Devarakonda Maruthi

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటివలే వలర్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈమూవీ బాక్సాఫిస్ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పనిచేస్తున్నాడు. ఈమూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పూరీ కనెక్ట్స్,, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, కరణ్ జోహర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తెలుగు హిందీతో పాటు తమిళ్ ,మలయాళ భాషల్లో ఈమూవీని విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాపై పెద్ద ఎత్తును అంచానాలు నెలకొన్నాయి. ఈమూవీ తర్వాత విజయ్ దేవరకొండ దర్శకుడు మారుతితో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మారుతి ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పైనే కసరత్తు చేస్తున్నాడని టాక్. మారుతి తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే మూవీ విజయం సాధించింది. కాగా ఇటివలే మజిలి సినిమాతో హిట్ కొట్టిన శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు విజయ్ దేవరకొండ. ఈ ఇద్దిరిలో ఎవరితో ముందు సినిమా చేస్తాడన్నది సస్పెన్స్ గా ఉంది.