మజిలీ దర్శకుడితో విజయ్ దేవరకొండ

443
Vijaya Devarakonda Shiva Nirvana
- Advertisement -

రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో చేస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈమూవీ తెరకెక్కుతుంది. ఈమూవీలో రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్ కాగా.. కేథరిన్ థ్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఎజిబెల్లా మరో ముగ్గురు హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. గోపి సుందర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈమూవీ తర్వాత విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేయనున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ ను పూర్తి చేశారు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈసినిమాకు పూరీ సొంత బ్యానర్ పూరీ కనెక్ట్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈమూవీ ప్రారంభంకాకముందే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్.

మజిలీ సినిమా దర్శకుడు శివ నిర్వాణతో తన తర్వాతి మూవీ చేయనున్నాడు. ఈవిషయాన్ని దర్శకుడు శివ నిర్వాణ మీకు మాత్రమే చెప్తా మూవీ ఆడియో లాంచ్ లో విజయ్ అభిమానులకు చెప్పాడు. శివ నిర్వాణ తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీ సినిమా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది చివర్లో ఈమూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

- Advertisement -