కేటీఆర్ నిర్ణయంపై ‘అర్జున్ రెడ్డి’ హర్షం..!

482
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో వేలాది ఎకరాల మేర విస్తరించిన సువిశాల నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు సేవ్‌ నల్లమల పేరుతో పలువురు ప్రముఖులు తమ వంతు మద్దతును తెలుపుతున్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు తమ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంలేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పట్ల యంగ్ హీరో విజయ్ దేవరకొండ సంతోషం వ్యక్తం చేశారు.

అడిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వం మన వెంటే నిలిచింది. మీ నిర్ణయం నా ముఖంపై చిరునవ్వులు తీసుకొచ్చింది అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి విజయ్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. పవర్, రెస్పాన్సిబిలిటీ, యాక్షన్… ఇలాంటి నాయకులనే నేను ఇష్టపడతాను అంటూ పేర్కొన్నారు. కేటీఆర్ అన్నా, మీపై ఎల్లప్పుడూ ప్రేమాభిమానులు ఉంటాయని వ్యాఖ్యానించారు.

ktr

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరేనియం మైనింగ్‌కు సంబంధించి నల్లమలలో ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, ఇవ్వబోదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నల్లగొండ జ్లిలాలోని లంబాపూర్, పెద్దగట్టు, చిత్రియాల్‌లో 1992-2012 కాలంలో ఎఎండీ యూరేనియం అన్వేషణ కోసం సర్వే, తనిఖీని చేపట్టింది. దాదాపు 18 వేల 550 మెట్రిక్ టన్నుల యూరేనియం నిక్షేపాలు ఉన్నాయని కనుగొనడం జరిగింది.

హైదరాబాద్‌లోని డీఏఈ, ఏఎండీ తరపున నాగార్జునసాగర్ డబ్ల్యూఎల్‌లోని చింత్రియాల్ ప్రాంతంలోని అదనపు 50 చదరపు కిలోమీటర్ల పైబడి సర్వే, తనిఖీ, బోర్లను తవ్వడం కోసం హైదరాబాద్‌లోని ప్రధాన అటవీ ముఖ్య పర్యవేక్షకునికి 2012లో అనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా నల్లమలలో యూరేనియం నిక్షేపాలు ఉన్నా వాటిని వెలికితీసేందుకు ఎటువంటి అనుమతి ఇవ్వబడదన్న షరతుతో 2016లోనే అప్పటి రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఆదేశాలు వెలువరించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరేనియం మైనింగ్‌కు సంబంధించి నల్లమలలో ఎలాంటి అనుమతి ఇవ్వలేదు.. ఇవ్వబోదు అనే విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలియజేస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -