విజయ్ దేవరకొండ ఫైటర్ లో శ్రీదేవి కూతురు  

491
vijay jahan
- Advertisement -

విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈమూవీలో విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

ఇక మూవీ తర్వాత విజయ్ దేవరకొండ పూరీ జగన్నాత్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ పని మీద బిజీగా ఉన్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్ . ఈసినిమాకు ఫైటర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. డిసెంబర్ నుంచి ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

ఇక ఈమూవీలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ను తీసుకోవాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఇటివలే చిత్రయూనిట్ జాన్వీని సంప్రదించారట అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా జాన్వీ కూడా గతంలో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అని తనతో నటించాలని ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.

- Advertisement -