ఆసక్తిరేపుతోన్న “డియర్ కామ్రేడ్” ట్రైలర్..(వీడియో)

73
Dear Comrade Trailer

రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ ఈచిత్రానికి దర్శకత్వం వహించగా..రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం విడుదలయిన ఈచిత్ర టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో హీరోయిన్ రష్మీక మందన క్రికెటర్ పాత్రలో కనిపించనున్నట్లు ట్రైలర్ లో చూస్తే అర్ధమవుతుంది. ఇక విజయ్ దేవరకొండ డిఫరెంట్ గెటప్ లలో కనిపించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ నిర్మించిన ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.