“తాళి” రీమేక్ లో ఆనంద్ దేవరకొండ

515
anand Devarakonda
- Advertisement -

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఈసినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. పల్లెటూరి అబ్బాయి పాత్రలో ఆనంద్ దేవరకొండ చాలా బాగా నటించాడు. జీవిత రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్ ఈసినిమాలో హీరోయిన్ గా నటించింది.

కాగా ఈమూవీ తర్వాత ఆనంద్ ఇటివలే ఓ సినిమాకు సైన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లవ్ రోమాన్స్ ఉన్న పాత్రలు కాకుండా కథలో బలం ఉండే పాత్రలతో ఎక్కువ ఇంపార్టెంస్స్ ఇస్తున్నాడు ఆనంద్ దేవవరకొండ. సుమారు పాతికేళ్ల క్రితం ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘తాళి’ చిత్రం రీమేక్ లో ఆనంద్ నటించనున్నట్లు తెలుస్తుంది. కొత్త దర్శకుడు ఈమూవీని తెరకెక్కంచనున్నట్లు సమాచారం. ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

- Advertisement -