‘జెర్సీ’.. ఓ జెన్యూన్ సినిమా..

270
- Advertisement -

నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తోన్న చిత్రం `జెర్సీ`. ఏప్రిల్ 19న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. విక్ట‌రీ వెంక‌టేష్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమంలో నాని క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసే వీడియో మోహన్‌ చెరుకూరి చేతుల మీదుగా విడుదలైంది. వెంకటేష్‌ తొలి టిక్కెట్‌ను విడుదల చేశారు.

Victory Venkatesh

ఈ సంద‌ర్భంగా…విక్ట‌రీ వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘క్రికెట్‌ ఇష్టం కాబట్టి ఇక్కడికి రాలేదు. చాలా జెన్యూన్‌గా, ప్రేమగా ఇక్కడికి వచ్చాను.జెర్సీ ఫస్ట్‌లుక్‌ వచ్చినప్పుడే చాలా ఇంప్రెస్‌ అయ్యాను. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి లుక్‌ చూసి ఇంప్రెస్‌ అయ్యా. అలాగే ట్రైల‌ర్ చాలా బాగా న‌చ్చింది. డైరెక్ట‌ర్‌ గౌతమ్‌ ఈ సినిమాలో ఏం చూపించాలనుకున్నారో క్లారిటీగా అదే చూపించారు. ట్రైలర్‌ చూశాక మైండ్‌ బ్లోయింగ్‌గా అనిపించింది. జెన్యూన్‌ సినిమాలు రేర్‌గా వస్తాయి. నానిని ఇలాంటి సినిమాలో చూసేసరికి చాలా బాగా అనిపించింది. ఇలాంటి పాత్రల్లో నటించేటప్పుడు చాలా ఎమోషనల్‌గా ఇన్వాల్వ్‌ అవుతుంటాం.

అందుకే ట్రైలర్‌ చూడగానే ఈ తరహా సినిమాలు స్ఫూర్తిగా అనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ హీరో పాత్ర చూసి ఇన్‌స్పయిర్‌ అవుతారు. ప్రతి ఒక్కరూ లైఫ్‌లో స్ట్రగుల్‌ అవుతుంటారు. అలాంటప్పుడు జీవితంలో మనం వదిలేయకూడదు. గట్టిగా ప్రయత్నించి సక్సెస్‌ సాధించాలని ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, లైఫ్‌ లెసన్‌ అని అర్థం చేసుకుంటాం. సినిమా ఔట్‌స్టాండింగ్‌గా ఉంటుంది. నిర్మాతలు నాకు చాలా మంచి మిత్రులు. దర్శకుడికి కంగ్రాట్స్‌. నానిని చూస్తే గర్వంగా ఉంటుంది. తను మనకున్న నేచురల్‌ స్టార్‌’’ అని అన్నారు.

- Advertisement -