నానీని చూస్తుంటే గర్వంగా అనిపిస్తుందిః వెంకటేశ్

38
nani venkatesh

న్యాచురల్ స్టార్ నాని చూస్తుంటే తనకు గర్వంగా అనిపిస్తుందన్నారు విక్టరీ వెంకటేశ్. టాలీవుడ్ లో నాని నిజంగానే న్యాచురల్ స్టార్ అని చెప్పారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన జెర్సీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ..తాను క్రికెట్ మీద ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమానికి రాలేదని..సినిమా మీద అభిమానంతో వచ్చానని తెలిపారు.

nani123

జెర్సీ మూవీ ఫస్ట లుక్, ట్రైలర్ చూశానని తనకు ఎంతో నచ్చిందని వెల్లడించారు. ఈచిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మూవీ చాలా బాగా తెరకెక్కించారన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఓడిదుడుకులు ఉంటాయని వాటిని అధిగమించుకుని వెళ్లినపుడే లైఫ్ లో సక్సెస్ సాధిస్తామాన్నారు. ఈసినిమాలో కూడా అదే విషయాన్ని చూపించారని తెలిపారు.

నాని నటించిన సినిమాల్లో జెర్సీ సినిమా ది బెస్ట్ అవుతుందన్నారు. ఈమూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాని..చిత్రయూనిట్ కు శుభాకాంక్షాలు తెలిపారు వెంకటేశ్. నాని, శ్రధ్దా శ్రీనాథ్ జంటగా నటించిన ఈసినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. అనిరుథ్ సంగీతం అందించిన ఈచిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. ఎప్రిల్ 19న ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.