వరుణ్ తేజ్ కోసం విక్టరీ వెంకటేశ్

88
Venkatesh & Varun Tej

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం వాల్మీకి. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈసినిమాకు దర్శకత్వం వహించారు. ఇటివలే విడుదలైన ఈమూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మొదటి సారిగా వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. వరుణ్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈమూవీని ఈనెల 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. ఈసందర్భంగా చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 15న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో నిర్వహించనున్నట్లు తెలిపారు నిర్మాతలు.

తాజాగా ఉన్న సమాచారం ప్రకారం వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విక్టరీ వెంకటేశ్ రానున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. తమిళ్ లో భారీ విజయం సాధించిన జిగార్తాండ మూవీకి ఇది రిమేక్ గా తెరకెక్కించారు. తమిళ్ లో ఘన విజయాన్ని అందుకున్న ఈమూవీ తెలుగులో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.