వరంగల్‌ అంటే ఎంతో ప్రేమ

346
vicepresidentvenkayya1
- Advertisement -

వరంగల్ నగరం అంటే తనకు ఎంతో ప్రేమ అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. వరంగల్‌లో ఆంధ్ర విద్యాభివర్ధిని(ఏవీవీ) విద్యాసంస్థల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎంపీలు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, బండ ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. విద్యా, సాంస్కృతిక, సాహిత్యానికి కేంద్రం ఓరుగల్లు అని అన్నారు. నీటి పారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీమన్నారు. కాకతీయులు నిర్మించిన చెరువులను కాపాడుకోవాలి. చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూడాలన్నారు. మాతృభాషను, జన్మభూమిని మరిచిపోవద్దని చెప్పారు. నైతిక విలువలతో కూడిన విద్య కావాలి అందిచాలన్నారు.

- Advertisement -