‘సూపర్‌ 30’ని తిలకించిన ఉపరాష్ట్రపతి..

127
Venkaiah

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన చిత్రం ‘సూపర్ 30’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన కుటుంబంతో కలసి వీక్షించారు. ఉప రాష్ట్రపతి భవన్‌లో ఆయన ప్ర‌త్యేక స్క్రీనింగ్ వేయించుకొని చూశారు. ఆ స‌మ‌యంలో వెంక‌య్య నాయుడుతో పాటు చిత్ర బృందం అంతా ఉన్నారు. సూప‌ర్ 30 చిత్రం త‌న మ‌న‌సుని క‌దిలించ‌ద‌ని వెంక‌య్య‌ తెలిపారు.

పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించే క్రమంలో ఆనంద్ ఎన్నో ఒడిడుడుకులు ఎదుర్కొన్నారని… ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. గొప్ప చిత్రాన్ని తెరకెక్కించారని కితాబిచ్చారు. అనంతరం హృతిక్ రోషన్, చిత్ర నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా, మధు మంతెన, ఒరిజినల్ ఆనంద్ కుమార్ తో కలసి ఫొటో దిగారు. ఈ ఫోటోను కూడా ఉపరాష్ట్రపతి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి వికాస్ బెహెల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నడియాద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌, టీవీ నటుడు నందిష్‌ సింగ్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు.