నటుడు రాళ్ళపల్లి ఇక లేరు..

121
Veteran Actor Rallapalli

టాలీవుడ్ సీనియర్ నటుడు రాళ్ళపల్లి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాళ్ళపల్లి ఆసుపత్రిలో చిక్కిత్సపొందుతు తుది శ్వాసను విడిచారు. 73 ఏళ్ల వయసులో ఉన్న ఈ సీనియర్ నటుడు గత ఏడాది వరకు పలు సీరియల్స్ అలాగే టీవీ షోల్లో నటించారు.

Veteran Actor Rallapalli

రాళ్లపల్లి 1955 అక్టోబర్ 10న తూర్పు గోదావరి జిల్లాలోని రాచపల్లిలో జన్మించారు. రాళ్లపల్లి 1979లో కుక్కకాటుకు చెప్పు దెబ్బ సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆయన 850 సినిమాల్లో నటించారు. రాళ్లపల్లి చిన్నతనం నుంచే నాటకాలు వేసేవారు. రాళ్లపల్లి ఎనిమిది వేలకుపైగా నాటకాల్లో నటించారంటే..నటనపై ఆయన ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఆయన మృతి పట్ల పలువురు నటులు సంతాపం వ్యక్తం చేశారు.