ఎఫైర్లు చాలా ఉన్నాయి…..ఇంటర్వ్యూలో వేణు

1354
venu madhav
- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్స్ లో వేణు మాధవ్ ఒకరు. టాలీవుడ్‌లో బ్రహ్మనందం, అలీ, సునీల్,లాగే ఇండస్ట్రీలో బాగా పేరు సంపాదించిన వ్యక్తి వేణు మాధవ్. కిడ్నీ సంబంధిత వ్యాధితో కొద్దిసేపటి క్రితం  కన్నుమూశారు వేణుమాధవ్. ఆయన మృతితో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది.

రచ్చ సినిమా తర్వాత నుంచి సినిమాల్లో కనిపించడంలేదు. దీంతో వేణుమాధవ్‌కు చాలా రోగాలున్నాయని, చనిపోయాడనికి కూడా గతంలో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తల పై  తెలంగాణ సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ నర్సింహన్‌ కలిసి తన చనిపోయనట్టు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇది జరిగిన కొద్దిరోజులకే వేణుమాధవ్ మృత్యువాత పడ్డారు.

Venu Madhav Comedian Has Lot of Balupu

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు వేణు. రచ్చ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ను పట్టుకుని నాకు లెక్కలెనన్ని రోగాలు ఉన్నాయని ప్రచారం చేశారు. రచ్చ సినిమా షూటింగ్‌ జరిగే సమయంలో నేను మరి కొన్ని సినిమాలు కూడా ఒప్పుకున్నాను. రాత్రి భోజనం చేయకుండా ఓ సినిమా షూటింగ్‌కు వెళ్లి నాపని పూర్తి చేశాను. తర్వాతి ఒక రోజు ఉదయం టిఫిన్‌ కూడా చేయకుండా ‘రచ్చ’షూటింగ్‌లో పాల్గొన్నాను. దాంతో ఒళ్లంతా వణుకుపుట్టి, కళ్లు తిరిగి పడిపోయాను. వెంటనే నన్ను ఆస్పత్రికి తరలించారు. జరిగింది అంతే. కానీ నాకు ఎన్నో రోగాలున్నాయని దృష్పచారం చేశారు. నేను ఆరోగ్యంగానే ఉన్నానని నాకు ఎలాంటి వ్యాధులు లేవని వేణుమాధవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు.

కొన్ని సినిమాలు బూతు డైలాగ్‌లు ఉన్న కారణంగా తాను పక్కనపెట్టానని, మరికొంత మంది కావాలని తనను పక్కనపెట్టారని చెప్పుకొచ్చాడు వేణుమాధవ్‌. తను పెళ్లి ఒకటే చేసుకున్నానని, ఎఫైర్లు మాత్రం చాలా ఉన్నాయని ఓ ప్రశ్నకు సరదాగా సమాధానమిచ్చాడు వేణుమాధవ్‌. అలాగే హైదరబాద్‌లోని ఈసీఐఎల్‌ నుంచి మౌలాలి వరకు తనకు పది ఇళ్లు ఉన్నాయని తెలిపాడు.
Venu Madhav Comedian Has Lot of Balupu
చిరంజీవి, బాలకృష్ణల మీద అభిమానంతోనే వారు చేస్తున్న ప్రతిష్టాత్మక సినిమాలు హిట్‌ కావాలని తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకున్నానని, ఆ రెండు సినిమాల్లోనూ తాను లేనని చెప్పాడు. కాగా, పవన్‌ ప్రస్తుతం చేస్తున్న ‘కాటమరాయుడు’ సినిమాలోనూ, తర్వాత చేయబోయే త్రివిక్రమ్‌ సినిమాలోనూ తాను నటిస్తున్నట్టు తెలిపాడు.

టాలీవుడ్‌కి ఇన్ని రోజులు గ్యాప్‌ ఇచ్చారు కదా. ఈ సమయంలో మీరు ఏం చేశారు అని అడిగితే తానకు కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ భూములున్నాయని అక్కడ వ్యవసాయం చేస్తూ ఇన్నిరోజులు బ్రతికాను అని సమాధానం ఇచ్చాడు కామెడియన్‌ వేణుమాధవ్‌.

- Advertisement -