“వెంకీమామ” మూడు రోజుల వసూళ్లు

548
venky mama
- Advertisement -

విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన చిత్రం వెంకీమామ. ప్రముఖ దర్శకుడు బాబీ ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా నటించిన ఈచిత్రానికి తమన్ సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. వెంకటేశ్ నాగచైతన్యలు మొదటిసారిగా రీల్ లైఫ్ లో మామ అల్లుళ్లుగా నటించడంతో ఈమూవీపై భారీగా ఆశలు ఉన్నాయి. డిసెంబర్ 13న వెంకటేశ్ పుట్టిన రోజు వెంకీమామ మూవీని విడుదల చేశారు చిత్రయూనిట్.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈమూవీ మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. అంతేకాకుండా బాక్సాఫిస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.6కోట్ల 80లక్షల రూపాయలు రాబట్టింది. శని,ఆది వారాలు వీకెండ్ కావడంతో అంతకంటే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది. విడుదలైన మూడు రోజుల్లో రూ.17.50కోట్ల రూపాయల షేర్ వసూలు చేసినట్లు తెలిపారు చిత్రయూనిట్. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 45 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు చేసింది. సినిమా భారీ విజయం సాధించి..అనుకున్నదానికంటే ఎక్కువ కలెక్షన్లు రావడంతో చిత్రయూనిట్ చాలా హ్యాపిగా ఉన్నారు.

- Advertisement -