ట్విట్టర్ రివ్యూ: వెంకీమామ

518
venky mama
- Advertisement -

విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రల్లో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వెంకీమామ. నిజజీవితంలో మామా అల్లుళ్లుగా ఉన్న వెంకటేశ్, నాగ చైతన్య లు తొలిసారిగా ఆన్ స్క్రీన్ పై కూడా మామ అల్లుళ్లుగా నటిస్తున్నారు. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా నటించిన ఈచిత్రానికి తమన్ సంగీతం అందించగా సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ నిర్మాతలు.

ఎఫ్2 లాంటి బ్లాక్ బస్టర్ తరవాత వెంకటేష్ చేసిన మరో మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది.

ఇప్పటికే ప్రివ్యూలు చూసిన వారు సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇచ్చేస్తున్నారు. సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోండగా కామెడీ, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యాయని, వెంకటేష్ తన పెర్ఫార్మెన్స్ మెస్మరైజ్ చేశారని చెబుతున్నారు. వెంకీ వన్ మ్యాన్ షోతో ఇరగదీశారని…నాగచైతన్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశారని చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే సినిమా బాగుందని చెబుతున్నారు.

Venky Mama is a 2019 Indian Telugu-language action comedy film produced by D. Suresh Babu under Suresh Productions banner and directed by K. S. Ravindra.

- Advertisement -