రామోజీ ఫిల్మ్ సిటీలో వెంకీమామ‌

705
venky mama
- Advertisement -

విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోలుగా రూపొందుతున్న మ‌ల్టీస్టార‌ర్ `వెంకీమామ‌`. కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకాల‌పై సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను అక్టోబ‌ర్ 8న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్ ప్రేక్ష‌కుల‌కు విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు.

ఈ కల‌ర్‌ఫుల్ పోస్ట‌ర్ చూస్తే ..ఓ ట్రాక్ట‌ర్‌లో వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, రాశీఖ‌న్నా ఉన్నారు. ప్ర‌స్తుతం సినిమా రామోజీ ఫిలింసిటీలో వేసిన ఓ భారీ సెట్‌లో పాట చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ త‌దిత‌రులు,సాంకేతిక వ‌ర్గం:ద‌ర్శ‌క‌త్వం: కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ),నిర్మాత‌లు: సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌,కో ప్రొడ్యూస‌ర్‌: వివేక్ కూచిబొట్ల‌,మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌,కెమెరా: ప్ర‌సాద్ మూరెళ్ల‌,ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి,పి.ఆర్‌.ఒ: వ‌ంశీ శేఖ‌ర్‌

- Advertisement -