“వెంకీ మామ” మూవీ రివ్యూ

1349
Venky mama Review

విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య నటించిన చిత్రం వెంకీ మామ. ప్రముఖ దర్శకుడు బాలీ ఈచిత్రానికి దర్శకత్వం వహించాడు. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా నటించగా..థమన్ సంగీతం అందించారు. నిజ జీవితంలో మామ అల్లుళ్లుగా ఉన్న వెంకటేశ్, నాగచైతన్యలు తొలిసారిగా స్క్రీన్ పై మామ అల్లుళ్లుగా నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించారు. విక్టరీ వెంకటేశ్ చేసిన మల్టీస్టారర్ సినిమాలు వరుసగా హిట్ అవుతున్నాయి. మరీ అల్లుడితో నటించిన వెంకీమామ సినిమా ఎలా ఉందో చూద్దాం…

కథః
ద్రాక్షారామం గ్రామంలో వెంకటరత్నం (వెంకటేష్) మిలటరీలో సేవలు చేయాలనుకుంటాడు. అమ్మ నాన్న లేని తన అల్లుడికార్తిక్‌ శివరామ్‌ (నాగ చైతన్య) ని ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుతాడు.లండన్‌లో ఉద్యోగం వచ్చినా మామయ్యకు దూరంగా వెళ్లడం ఇష్టం లేక ఆ ఉద్యోగాన్ని వదిలేసుకుంటాడు. మామాఅల్లుళ్లు ఒకరిని విడిచి మరొకరు ఒక్కరోజు కూడా ఉండలేరు. అల్లుడి కోసం తన పెళ్లిని వాయిదా వేస్తుంటాడు వెంకటరత్నం. వెంకటరత్నం తండ్రి.. కార్తిక్ తాతయ్య (నాజర్) మామ అల్లుళ్లను వేరు చేయాలని ప్రయత్నిస్తుంటాడు. అలాంటి సమయంలోనే తన జాతకం గురించి ఓ కఠినమైన నిజం తెలుసుకుంటాడు కార్తిక్. దాంతో మామయ్యను వదిలేసి ఆర్మీలో చేరిపోతాడు. అయితే చెప్పకుండా వెళ్లిపోవడంతో అల్లుడు గురించి వెతుక్కుంటూ మామ కూడా వెళ్తాడు. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది.. కార్తిక్ వెళ్లిపోవడానికి కారణం ఏమిటి?అతడు ఎక్కడకు వెళతాడు? అనేది సినిమా కథ.

venkmama

ప్లస్ పాయింట్స్ః

రియల్‌ లైఫ్‌ మామా అల్లుళ్లు వెంకీ, చైతూలు రీల్‌ లైఫ్‌లోనూ అంతే ఈజ్‌తో నటించారు. ఇద్దరు తమ పాత్రల్లో జీవించారనే చెప్పాలి. వెంకటేష్‌ తన కామెడీ టైమింగ్‌తో పాటు ఎమోషనల్‌ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. మేనల్లుడిపై అమితమైన ప్రేమానురాగాలున్న మామయ్యగా సినిమాను తన భుజస్కందాలపై వేసుకొని నడిపించారు. లవర్‌బాయ్‌గా, సైనికుడిగా భిన్నపార్వాలతో అతడి పాత్ర కనిపిస్తుంది. వారి పాత్రలకు తప్ప కథలో మిగతా వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. దర్శకుడు బాబీ ఈసినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. పల్లెటూరి వాతావరణం, అక్కడి ప్రేమానురాగాలను, రాజకీయాలు చాలా బాగా చూపించాడు దర్శకుడు. ఎమ్మెల్యే కుమార్తెగా రాశి ఖన్నా తన పాత్ర మేరకు నటించగా.. టీచర్‌గా పాయల్ రాజ్‌పుత్ మెప్పించింది. . అయితే ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే సెకండ్‌ హాఫ్‌ కాస్త తగ్గిందనే చెప్పాలి. ఇక సంగీతం విషయానికి వస్తే పాటలు అంతగా మెప్పించకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడని చెప్పుకోవాలి. సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ సినిమాటోగ్రఫి ప్రసాద్‌ మూరెళ్ల.

మైనస్ పాయింట్స్ః
ముఖ్యంగా కథలో పెద్దగా కొత్త ధనం లేకపోవడం వల్ల సినిమా చూసే ప్రేక్షకులకు కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. మామాఅల్లుళ్లు దూరం కావడానికి గల కారణాల్ని బలంగా ఆవిష్కరించలేకపోయారు. జాతకాలు అబద్ధం అంటూ తేల్చిచెప్పిన కార్తిక్ ఒక్కసారి వాటిపై నమ్మకాన్ని పెంచుకోవడం కన్వీన్సింగ్‌గా అనిపించదు. అలాగే సర్జికల్‌ స్ట్రైక్స్ ఎపిసోడ్‌ను రొమాంచితంగా తీర్చిదిద్దలేకపోయారు. హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే తీసుకున్నారని అనిపిస్తుంది. కథకు హీరోయిన్ల పాత్రలకు అసలే సంబంధమే లేదు. వినీతిపరుడైన రాజకీయనాయకుడిగా రావురమేష్ విలక్షణ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. విద్యుల్లేఖరామన్,హైపర్ ఆది, చమ్మక్‌చంద్ర కామెడీ సరిగా పండలేదు.

తీర్పుః
వెంకీమామ సినిమా కథలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తుంది. ఈమూవీలో ఎమోషనల్, కామెడీ, టైమింగ్ పంచులతో వెంకటేశ్ హైలెట్ గా నిలిచారు. ప్రస్తుతం సినిమాలు లేకోవడంతో వెంకీమామ కు కలెక్షన్ల పరంగా బాగానే రావచ్చని తెలుస్తుంది. ఫైనల్ గా దగ్గుబాటి, అక్కినేని అభిమానులు మాత్రమే ఇష్టపడే సినిమా వెంకీమామ.

విడుదల తేదీః 13/12/2019
రేటింగ్ః 2.75/5
నటీనటులుః వెంకటేష్‌,నాగచైతన్య,రాశీఖన్నా,పాయల్‌ రాజ్‌పుత్‌,ప్రకాష్‌రాజ్‌,నాజర్‌,రావూ రమేష్‌, చమ్మక చంద్ర, హైపర్ ఆది
సంగీతంః యస్ యస్ థమన్
నిర్మాతలుః సురేష్ బాబు, విశ్వ ప్రసాద్
దర్శకత్వంః బాబీ (కేయస్‌ రవీంద్ర)