వెంకీ ‘వాయిస్ ఓవర్’తో శ్రీనివాస కల్యాణం

210
- Advertisement -

టాలీవుడ్‌ హీరో నితిన్‌, బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘శ్రీనివాస కల్యాణం’.శతమానంభవతి ఫేమ్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే సినిమా టీజర్,ట్రైలర్,ఆడియో రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ సినిమా కోసం తన గాత్రాన్ని అందించారు విక్టరీ వెంకటేష్‌. ఇందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది చిత్రయూనిట్.

venkatesh

ఇటీవల విడుదల చేసిన శ్రీనివాస కల్యాణం మేకింగ్ వీడియోకి మంచి స్పందన వస్తోంది. వీడియోలో ఇంట్లో జరుగుతున్న పెళ్లికి పెద్దలు, పిల్లలు చేసే సందడంతా చూపించారు. చిత్రీకరణలో దాదాపు 60 మంది క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు ఉన్నట్లు వీడియోలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు.

- Advertisement -