త్వరలోనే సెట్స్‌పైకి “వెంకీ మామ”

329
- Advertisement -

బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య “వెంకీ మామ” అనే మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి
తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్
కార్పొరేషన్ సంస్థలు నిర్మిస్తున్నాయి. కథానాయికలుగా రకుల్, హ్యూమా ఖురేషి నటిస్తున్నారు.
అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో, మూవీ షూటింగ్ పూర్తైందనే
వార్తలు జోరందుకున్నాయి.

ఈ క్రమంలో నిర్మాతలు స్పందిస్తూ.. రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 12వ
తేదీ నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. జ్యోతిష్యం నేపథ్యంలో ఈ సినిమా
తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. నిజ జీవితంలో మేనమామ వెంకీ, మేనల్లుడు చైతూ తెరపై ఎలా
కనిపించనున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. జ్యోతిష్యం, నమ్మకాల మధ్య మామా, అల్లుళ్ల మధ్య
చోటుచేసుకునే సన్నివేశాలు వినోదభరితంగా ఉంటాయని ఫిల్మ్ నగర్ టాక్.

- Advertisement -