వరుణ్‌ తేజ్‌కు తప్పిన ప్రమాదం..

217
varun tej

మెగా హీరో వరుణ్ తేజ్‌కు ప్రమాదం తప్పింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై వరుణ్ తేజ్‌ కారును మరో కారును ఢీకొట్టంది. ఈ ప్రమాదం నుంచి వరుణ్ తేజ్ క్షేమంగా బయటపడ్డారు. వాహనం దెబ్బతినడంతో వరుణ్‌ తేజ్‌, ఇంకొందరు నటులు మరో వాహనంలో బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు.

హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు షూటింగ్‌ నిమిత్తం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ నుజ్జునుజ్జయ్యాయి. . సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్..హరీష్ శంకర్‌ కాంబినేషన్‌లో వాల్మీకి మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ మూవీ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కానుంది.