గద్దలకొండ గణేష్‌…గత్తర లేపిండు..!

509
varun tej

మెగా హీరో వరుణ్ తేజ్‌ -హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం వాల్మీకి. తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ మూవీకి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ప్రీ లుక్‌,ఫస్ట్ లుక్‌,టీజర్‌లతో ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ట్రైలర్‌తో ఫ్యాన్స్‌ని అలరించాడు వరుణ్.

సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్లే ట్రైలర్‌లో ఇరగదీశాడు వరుణ్‌ తేజ్ అలియాస్ గద్దలకొండ గణేష్. నా మీద పందేలు కడితే గెలుస్తరు.. నాతో పందెం కడితే సస్తరు అంటూ రచ్చ లేపాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వచ్చినపుడు పూజా హెగ్డేపై ఎల్లువొచ్చి పాట ఆర్ఆర్ వాడుకున్నాడు హరీష్ శంకర్. గవాస్కర్ సిక్స్ కొట్టుడు.. బప్పీలహరీ పాట కొట్టుడు.. నేను బొక్కలిరగ్గొట్టుడు సేమ్ టూ సేమ్ అంటూ వరుణ్ చెప్పిన డైలాగ్‌లు ట్రైలర్‌కు హైలైట్‌గా నిలవగా చివరగా వాల్మీకి గత్తర లేపిండు అంటూ ముగించారు. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రస్తుతం రిలీజైన ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి…