మాస్… ఆ కిక్కే వేరు : వరుణ్ తేజ్‌

322
varun tej

మాస్ సినిమా చేస్తే వస్తే కిక్కే వేరని తెలిపారు హీరో వరుణ్ తేజ్‌. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ హీరోగా తెరకెక్కిన వాల్మీకి ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన వరుణ్..ఇప్పటివరకు క్లాస్,లవ్ స్టోరీలు చేస్తూ వచ్చాను…కానీ తొలిసారి ఒక మాస్ సినిమా చేశారు…ఆ కిక్కే వేరు..మాములుగా లేదమ్మ అంటూ డైలాగ్‌లు చెప్పి ప్రేక్షకులను అలరించాడు.

బాబాయ్ పవన్ కళ్యాణ్‌కు గబ్బర్ సింగ్ లాంటి హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్‌తో పనిచేయడం తన అదృష్టమని వరుణ్ అన్నారు. సినిమా ట్రైలర్ చూసి బాబాయ్ నాతో, హరీష్ తో ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ యాస బాగా మాట్లాడావ్ అని చెప్పారని తెలిపారు.

ఈ సినిమాకు ప్రీ రిలీజ్‌కు అతిథిగా వచ్చిన వెంకటేష్‌కు థ్యాంక్స్ చెప్పారు. తాను ఫోన్ చేసి అడిగిన వెంటనే ఆయన ఓకే చెప్పారని ..మాస్ సినిమాలో ఒక కిక్ ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి తనకు చెప్పారని, దాన్ని ఇప్పుడు కొంచెం రుచి చూశానని అన్నారు.

వాల్మీకి కచ్చితంగా అందరికీ నచ్చుతుందని సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరారు. అలాగే, తన పెదనాన్న సినిమా సైరా నరసింహారెడ్డిని వాల్మీకికంటే రెండింతలు పెద్ద హిట్ చేయాలని అభిమానులను, ప్రేక్షకులను కోరారు వరుణ్ తేజ్‌.