ఓల్డ్ లుక్ లో వరుణ్ తేజ్..

384
Varun Tej
- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వాల్మీకి. వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటించింది. ఈసినిమా విడుదలకు ముందే టైటిల్ విషయంలో వివాదంలో ఇరుక్కుంది. అయితే ఇటివలే ఈచిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. 14రీల్స్ బ్యానర్ పై అనిల్ సుంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా… మిక్కి జే మేయర్ సంగీతం అందించారు.

ఇందులో వరుణ్ డిఫెరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు. గుబురు గడ్డం.. ఉంగరాల జుట్టు నోట్లో సిగార్.. చేతిలో గన్నుతో భయపెట్టే విధంగా ఉన్న వరుణ్ తేజ్ గెటప్ కు అందరు ఫిదా అయ్యారు. ఆ గెటప్ అందరిని ఆకట్టుకుంది. తాజాగా వరుణ్ తేజ్ కు సంబంధించి మరో లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఓల్డ్ లుక్ లో వరున్ తేజ్ చాలా అందంగా కనిపిస్తున్నాడు.

ఇక ఈమూవీలో నితిన్ గెస్ట్ రోల్ లో కనిపించగా.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. తమిళ్ లో ఘన విజయం సాధించిన జిగార్తాండ మూవీకి ఇది రిమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈమూవీని సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నారు.

- Advertisement -