‘వాల్మీకి’లో వరుణ్‌ తేజ్‌ పాత్ర పేరు ఇదే..!

504
varuntej
- Advertisement -

వరుణ్ తేజ్- హరీష్ శంకర్ కాంబీనేషన్‌లో ‘వాల్మీకి’ అనే చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆ మధ్య రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇటీవలే ఓ పాటను చిత్రికరించింది చిత్ర బృందం. ఈ పాటను గోదావరి ఒడ్డున వరుణ్‌ తేజ్‌,పూజా హెగ్డే‌లపై చిత్రికరించారని తెలుస్తోంది.

Varun Tej

అయితే ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్‌లతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. దీంతో సినిమాకు బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగినట్లుగా సమాచారం.ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్‌తో కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీలో తన పాత్ర పేరును వరుణ్‌ రివీల్‌ చేశాడు.

‘గద్దలకొండ గణేశ్’ అనే విషయాన్ని వరుణ్ తేజ్ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాడు. ‘వాల్మీకి’ తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘జిగర్తాండ’ అనే సినిమాకు అఫీషియల్‌ రీమేక్‌గా వస్తోంది. ఈ చిత్రం ఈ నెల 20వ తేదీన విడుదల కానుంది.

- Advertisement -