జనసేనలోకి వంగవీటి రాధా..బీజేపీలోకి అంబికా కృష్ణ

308
vangaveeti radha

ఏపీలో రోజురోజుకు రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా టీడీపీకి గట్టి షాకిస్తూ ఒక్కరొక్కరుగా నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధా,అంబికా కృష్ణ టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో వంగవీటి రాధా సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు వంగవీటి జనసేనలో చేరే అవకాశం ఉంది. ఏపీలో రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై వీరిద్దరిమధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

2019 అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు వైసీపీ నుంచి బయటకొచ్చిన రాధా టీడీపీలో చేరారు.అంతకుముందు కాంగ్రెస్‌,చిరు స్ధాపించిన ప్రజారాజ్యంలోను పనిచేశారు వంగవీటి.

రాధాతో పాటు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ చేరుకున్న ఆయన త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. బాలకృష్ణకు సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబికా కృష్ణను ఫిల్మ్, టెలివిజన్ మరియు థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా చంద్రబాబు నియమించారు. వీరిద్దరు పార్టీని వీడుతుండటం టీడీపీకి పెద్ద షాకేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.