‘వాల్మీకి’ నుండి వస్తున్న మరో సాంగ్..

295

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా వాల్మీకి. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.తమిళ బ్లాక్ బస్టర్ ‘జిగర్తాండ’కు ఇది రీమేక్.రామ్ ఆచంట – గోపీనాథ్ ఆచంట నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. వరుణ్ తేజ్ .. అధర్వ మురళి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, వాళ్ల జోడీలుగా పూజా హెగ్డే – మృణాళిని రవి కనిపించనున్నారు.

Valmiki Movie

ఈ చిత్రం నుంచి ఇటీవలే ‘జర్రా జర్రా’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘గగన వీధిలో’ అనే మరో లిరికల్ వీడియో సాంగ్‌ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ పాటను అధర్వ మురళి-మృణాళిని రవిపై చిత్రీకరించినట్టుగా పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. మిక్కీ జె.మేయర్ సమకూర్చిన ఈ మెలోడీకి వనమాలి సాహిత్యాన్ని అందించారు.