అతని సినిమా ఆడకూడదని పూజలు చేశారు

351
vallabhaneni Vamshi

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు వల్లభనేని వంశీ. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తే అది ఆడకూడదు అని కొంత మంది కొబ్బరికాయలు కొట్టే వారని తెలిపారు ఎమ్మెల్యే వంశీ. ఈ అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. లోకేశ్ కోసమే ఎన్టీఆర్ ను పక్కన పెట్టారని చెప్పాడు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే లోకేష్ భవిష్యత్ ఉండదని అందుకే అతన్ని పక్కన పెట్టినట్లు తెలిపాడు. లోకేష్ రావడం వల్లే టీడీపీ కి ఈ గతి పట్టిందన్నారు. కాగా వంశీ చేసిన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ పై విమర్శలు చేస్తున్నారు. ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో తారక్ అభిమానులంతా తమ ఆగ్రహాన్ని టీడీపీ నాయకుల పై వెళ్లగక్కుతున్నారు. ఈ మ్యాటర్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి. కాగా వల్లభనేని వంశీ త్వరలోనే వైసీపీలో చేరనున్నారు.

Vallabhaneni Vamshi Comments On Junior Ntr And Chandrababu