ఉత్తమ్ రాజీనామాతో టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం?

378
Trs Congres
- Advertisement -

గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 స్ధానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా నియోజక వర్గ అభివృద్ది కోసం 11మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఆ పార్టీలో ఇంకా 9మంది మాత్రమే మిగిలి ఉండటంతో టీఆర్ఎస్ ఎల్పిలో విలీనం చేయవచ్చు..

ఇక ఉత్తమ్ రాజినామాతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 10కి చేరింది. మూడింట రెండొంతుల మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంత‌కం చేస్తే కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష టీఆర్ఎస్‌లో విలీనం అవుతుంది. అంటే 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు అనుకూలంగా సంత‌కం చేయాలి. మొత్తానికి ఉత్తమ్ రాజీనామాతో అధికారపార్టీ టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం అవుతుందా లేదా చూడాలి. హుజర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే సీఎల్పి వీలినం లాంఛనమే అని చెప్పుకోవాలి.

- Advertisement -