రేపు మీరే చూడండి.. కోహ్లీనే వాడుకుంటా

234
using-kohlis-brain-more-now
using-kohlis-brain-more-now
- Advertisement -

కివీస్‌తో టెస్ట్‌ సారథిగా విరాట్ కోహ్లీ తన పని పూర్తి చేసుకున్నాడు. 2014లో టెస్టుల నుండి ధోనీ తప్పుకున్న తరువాత విరాట్ కోహ్లీ టెస్ట్‌ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. విరాట్‌ ఒక్క సిరీస్‌ కూడా ఓడిపోలేదు. అదే సమయంలో వన్డేలకు పరిమితమైన ధోనీ మాత్రం బ్యాట్స్‌మన్‌గా, సారథిగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. రేపటి నుండి ధర్మశాల వేదికగా ధోనీ నాయకత్వంలో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సంధర్బంగా మహేంద్ర సింగ్ ధోనీ ధ‌ర్మ‌శాల‌లో మీడియాతో మాట్లాడాడు.

M_S_DHONI

క్రికెట్ రోజు రోజుకూ మారుతోంది. భ‌విష్య‌త్తులో అది మరింత మారే ఛాన్సుంది. అయితే దూకుడుగా ఆడే టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇచ్చే స‌ల‌హాల‌ను ఎక్కువ‌గా వాడుతున్న‌ట్లు టీమిండియా వ‌న్డే కెప్టెన్ ధోనీ తెలిపాడు. మైదానంలో ఉన్న‌ప్పుడు కోహ్లీ ఐడియాల‌నే ఎక్కువ‌గా వినియోగిస్తున్నాన‌ని చెప్పాడు. మ్యాచ్‌లు జ‌రుగుతున్న‌ప్పుడే మీరే గ‌మ‌నించండి, నేను ఎక్కువ‌గా విరాట్‌తో మాట్లాడుతుంటాను, కోహ్లీ ఇచ్చే సలహాలను నేను ఎక్కువ‌గా వాడుకుంటున్నాన‌ని ధోనీ అన్నాడు. రేప‌టి నుంచి కివీస్ తో వ‌న్డే సిరీస్ ప్రారంభంకానున్న నేప‌థ్యంలో ధోనీ ఈ వ్యాఖ్య‌లు చేశాడు.

గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ లో సెమీస్‌లో ఓడిన ధోనీసేన ఆ తర్వాత ఒక్క వన్డే సిరీ్‌సలో మాత్రమే గెలిచింది. అది కూడా జింబాబ్వేపైన. ఆసే్ట్రలియా, దక్షిణాఫ్రికాతో పాటు బంగ్లాదేశ్‌ చేతిలో కూడా ఓడిపోవడంతో నాయకుడిగా మహీ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అదేవిధంగా కోహ్లీ కూడా టెస్ట్‌ సారధిగా టీమిండియాను నెం 1లో నిలబెట్టాడు. ఇప్పుడు ధోనీపై అన్ని వైపుల నుండి విమర్శలు వస్తుండడంతో ధోనీ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

- Advertisement -