యురేనియం తవ్వకాలపై అనుమతులు ఇవ్వలేదు: సీఎం

724
cm kcr
- Advertisement -

యురేనియం తవ్వకాలపై ఎవరికి అనుమతులు ఇవ్వలేదు….భవిష్యత్‌లో ఇవ్వబోమని సీఎం కేసీఆర్ చెప్పారు. బడ్జెట్‌ పై చర్చకు సమాధానం సందర్భంగా మాట్లాడిన సీఎం …బడ్జెట్‌ చర్చలో పాల్గొన్నందరికి ప్రభుత్వం తరపున దన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలపై ఒత్తిడి తెస్తే అందరం కలిసి పోరాడుదామని చెప్పారు. ఆర్థిక మాద్యం అనేది ఉంది, దాని పరిణామాలు ఏఏ రంగాలపై ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. దేశం ఏం కాబోతోందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోందన్నారు. దేశ ఆర్థిక ముఖచిత్రం ఎలా ఉండబోతోందనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆనంద్ మహీంద్రా లాంటి వారు మూడేళ్లదాకా తేరుకోలేమని చెప్తున్నారు.

రాష్ట్ర రుణభారం పెరిగిందని విపక్షాలు చెబుతున్నాయి. ప్రజలకు లేని భయోత్పాతాలను సృష్టించే ప్రయత్నం చేయొద్దు. పిల్లలు గూటంలా ఉండాల్నంటే గుమ్మిల వడ్లు ఖతం కావాలి. ఉన్న వనరులను వాడుకోలేకపోతే అవివేకం అంటారు. ఆర్థిక నిపుణుల విశ్లేషణను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించామని చెప్పారు. ప్రగతి నిరోధక శక్తులు కొన్ని అడ్డుపడినా, వాటిని అధిగమించి 21శాతం వృద్ధిరేటు సాధించామని తేల్చి చెప్పారు.

భారతదేశ ఆర్థిక వృద్ధిలో తెలంగాణ రాష్ట్ర పాత్ర ముఖ్యమైంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా దేశ ప్రగతిలోనూ పాలు పంచుకున్నామని చెప్పిన సీఎం… అధునాతన పద్ధతులు నచ్చని వాళ్లని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని…. రెండు పంటల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకున్న అప్పు తీరుతుందని చెప్పారు. తెలంగాణ రైతులు అంచు ధోతీ కట్టుకునే రోజులొస్తాయని చెప్పిన సీఎం…. కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరు ప్రజలందరికి తెలియాలి.

తండాలను గ్రామపంచాయతీలుగా మార్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్‌లాగా ఆడితప్పడం, మభ్యపెట్టడం లాంటివి మే చేయలేదన్నారు. తెలంగాణ రాష్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షా 17వేల పై చిలుకు ఉద్యోగాలు భర్తీ అయ్యాయని చెప్పారు. ఇంకా 30 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

సబ్‌ప్లాన్ నిధులను మళ్లించామని పచ్చి అబద్ధాలు మాట్లాడుతన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో ఖర్చు పెట్టిన ప్రతీ పైసాకు లెక్కుంది. దళితులను ఆదుకునే విషయంలో తెలంగాణ ఛాంపియన్ కావాలన్నారు.

- Advertisement -