ఉప్పెన ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ డేట్ ఫిక్స్..!

789
uppena
- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి చెల్లెలు కొడుకు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఉప్పెన మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గురువారం(రేపు) సాయంత్రం 4.05 గంటలకు ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో కలిసి క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కృతికా శెట్టి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈచిత్రాన్ని 2020 ఎప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్.

- Advertisement -