ఈ వస్తువులు ఎవరికి ఇవ్వాలో చెప్పండిః ఉపాసన

154
Upasana.jpeg

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో చాలా యక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా మరో విషయాన్ని ట్వీట్టర్ ద్వారా పంచుకున్నారు ఉపాసన.

నా వార్డ్ రోబ్ ను మొత్తం క్లీన్ చేశాక ఎంతో మానసిక ప్రశాంతత లభించింది. అయితే దానికి ఎంతో సమయం, ఎంతో శ్రమ ఖర్చైనా కష్టానికి తగ్గ ఫలితం లభించింది. నాకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడంలో ఎప్పుడూ దుబారా చేయను. చాలా జాగ్రత్తగా వస్తువులు కొంటుంటాను. అయినప్పటికీ కొన్ని దుస్తులను వార్డ్ రోబ్ నుంచి తీసేసి మూటకట్టాను. వాటిని చారిటీ సంస్థలకు నిధులు సేకరించేందుకు అమ్మేయాలని భావిస్తున్నాను. మరి ఎవరికి విరాళంగా ఇస్తే బాగుంటుందో చెప్పండి” అంటూ నెటిజన్ల నుంచి సూచనలు, సలహాలు కోరారు.