జీ ప్లస్ 1 ఇంటి నిర్మాణానికి నో పర్మిషన్: సీఎం కేసీఆర్

158
cm kcr

పారదర్శకత కోసమే తెలంగాణలో కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ మున్సిపల్ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ 75 గజాల లోపు జీ ప్లస్ వన్ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అవసరం లేదన్నారు. పంచాయతీ రాజ్ అనేది ఒక విభాగం కాదు ఉద్యమం అన్నారు.

పంచవర్ష ప్రణాళికను ప్రతిసభ్యుడు అధ్యయనం చేయాలన్నారు. బలమైన పునాదులున్న రాజ్యాంగం మనదన్నారు. అర్బన్ లోకల్ బాడీలు మంచి పద్దతిలో ఉండాలనే కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు.500 జనాభావ ఉండే గ్రామానికి కూడా మంచిగా నిధులు వస్తాయని చెప్పారు.

పంచాయతీరాజ్ ఉద్యమాల స్పూర్తిని రాజకీయాల కోసం చంపేశారని చెప్పారు సీఎం. 75 గజాల లోపు ఇంటికి పన్ను 1000 రూపాయలు మాత్రమే అన్నారు. కొత్త చట్టంతో మున్సిపాలిటీలు,పంచాయతీలకు నిధుల కొరత ఉండదన్నారు. మొక్కలు నాటడం పెద్ద విషయం కాదు కానీ అలాంటి చైతన్యం కూడా మనలో ఉండటం లేదన్నారు సీఎం.

ఆహారభద్రత విషయంలో స్వావలంభన అవలంభించాలన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులతో గ్రామీణ ప్రాంతాలకు రూ. 1600 కోట్లు,పట్టణ ప్రాంతాలకు రూ.1030 కోట్ల నిధులు వస్తున్నాయని చెప్పారు.రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు,13 కార్పొరేషన్లు ఉన్నాయని తెలిపారు.