జర్నలిస్టుపై దాడి.. నోట్లో మూత్రం పోసిన పోలీస్‌.. వీడియో

220
UP Journalist
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టులపై జరుగుతున్న దారుణాలు ఆగడం లేదు. ఇప్పటికే పలువురు జర్నలిస్టులపై ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు పంపగా, తాజాగా మరో దారుణ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో ప్రభుత్వ అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

రైలులో జరుగుతున్న అనధికారిక వ్యాపారులపై ఓ కథనాన్ని చిత్రీకరించేందుకు వచ్చిన విలేకరిపై రైల్వే పోలీసు ఇనస్పెక్టర్ రాకేశ్ కుమార్ అతి దారుణంగా ప్రవర్తించాడు. అమిత్‌ శర్మ అనే విలేకరిపై రాకేశ్ దాడి చేసి తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.

తనను దారుణంగా కొట్టి, కెమెరాను ధ్వంసం చేశారని జర్నలిస్టు వాపోయారు. అంతేకాదు లాకప్‌లో వేసి బట్టూడదీసి, నోటిలో మూత్రం పోసారని ఆరోపించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో విరివిగా షేర్‌ అవుతూ వైరల్‌ కావడంతో రైల్వే అధికారులు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యుడైన అధికారి రాకేష్‌కుమార్‌ తోపాటు మరో రైల్వే కానిస్టేబుల్‌ సునీల్‌ కుమార్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు.

- Advertisement -