కుల్దీప్ సెంగార్ శిక్షపై విచారణ వాయిదా

515
unnavo case
- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా తేలుస్తూ ఢిల్లీ తీస్ హజారీ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సెంగార్ శిక్ష ఖరారు చేసే విషయంపై వాదనలను డిసెంబర్ 20కి వాయిదా వేసింది కోర్టు.

2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంగార్ దాఖలు చేసిన అఫిడవిట్ కాపీని సమర్పించాలని ఎన్నికల సంఘానికి సూచించింది న్యాయస్ధానం. సెంగర్ దశాబ్దాల కాలంగా ప్రజా జీవితంలో ఉన్నారు..అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషిచేశారని ఆయనకు తక్కువ శిక్ష విధించాలని సింగర్ తరపు న్యాయవాది వాదించగా దోషి సెంగర్‌కు వీలైనంత ఎక్కువ శిక్ష విధించాలని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. బాధితురాలికి తగిన పరిహారం అందేలా చూడాలని అభ్యర్ధించింది.

- Advertisement -