అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుందిః ట్రంప్

440
Trump Speech
- Advertisement -

అమెరికా ఎప్పుడూ ఇండియాను ప్రేమిస్తుందన్నారు అన్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియం ప్రారంభోత్సవం అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ట్రంప్. ముందుగా నమస్తే అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు ట్రంప్. మోదీ…. గ్రేట్ ఛాంపియన్ ఆఫ్ ఇండియా అని ప్రశంసించారు. రాత్రి పగలు దేశం కోసం పాటు పడుతున్న వ్యక్తి ప్రధాని మోదీ అన్నారు. మోదీతో కలిసి ఈసమావేశంలో పాల్గోనడం నా అదృష్టం అన్నారు. 8వేల మైళ్ల దూరం నుంచి వచ్చి తాను ప్రసంగం చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద స్టేడియాన్ని ప్రారంభించడం నాకు దక్కిన గౌరవం అన్నారు. మోతెరా స్టేడియం అధ్బుతంగా ఉందన్నారు. అమెరికా ఇండియా పట్ల నమ్మకంగా ఉంటుందన్నారు. మోతెరా స్టేడియం చాలా బావుందంటూ కొనియాడారు. ఆర్ధికంగానూ బలమైన దేశంగా భారత్ అవతరించిందన్నారు. స్వామి వివేకానంద బోధనలు ప్రతి ఒక్కరికి ఆదర్శం అన్నారు.

70ఏళ్లలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ అవతరించిందన్నారు. ఇండియా ప్రజలు మా కుటుంబంపై కనబర్చిన ప్రేమను చిరకాలం గుర్తుంచుకుంటామని తెలిపారు. అమెరికా హృదయంలో భారత్ కు ప్రత్యేక స్ధానం ఉంటుందన్నారు. సచిన్, విరాట్ కోహ్లి లాంటి క్రికెటర్లు ఉన్న అద్బుతమైన దేశం ఇండియా అన్నారు. దీపావళి, హోళి లాంటి పండగలు సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపడతాయన్నారు. భిన్న మతాలు, జాతుల సమ్మెళనం ఇండియా అన్నారు. వందల భాషలు, 29 రాష్ట్రాలతో భారత్ భిన్నత్వంలో ఏకత్వం అన్నారు.

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం కొనసాగుతుందన్నారు. ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను అడ్డుకోవడానికి భారత్, అమెరికా పోరాడుతున్నట్లు తెలిపారు. సరిహద్దులను నియంత్రించే హక్కు దేశాలకు ఉంటుందన్నారు. ఇండియాలో అద్భుతమైన కట్టడం తాజ్ మహల్ ను చూడబోతున్నట్లు తెలిపారు. ఇస్లామిక్ టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలపునిచ్చారు. ఐసిస్ ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టినట్లు తెలిపారు. టెర్రరిజాన్ని అమెరికా ఏ మాత్రం సహించబోదన్నారు. ఉగ్రవాదులను ప్రొత్సహించవద్దని పాకిస్ధాన్ ను కోరుతున్నట్లు తెలిపారు.

- Advertisement -