కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్..

203
kishan reddy

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్‌ కాల్స్ వచ్చాయి. ఇంటర్నెట్ ఫోన్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కిషన్ రెడ్డి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గతంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేఎల్పీ నేతగా, ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలోనూ కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆయన ఇంటి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ కూడా నిర్వహించారు.తాజాగా ఆయన కేంద్రమంత్రి అయినా బెదిరింపులు ఆగడం లేదు.

తెలంగాణ బీజేపీలో కీలకంగా ఉన్న కిషన్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మోడీ కేబినెట్‌లో హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.