తెలంగాణకు ‘నో’ రైల్వే…కేటీఆర్ ట్వీట్ వైరల్‌

550
ktr twitter
- Advertisement -

కేంద్ర బడ్జెట్‌పై మరోసారి పెదవి విరిచారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తూనే ఎద్దేవా చేశారు. రైల్ సర్వీస్ రాలేదు,కొత్త రైల్వే లైన్ లేదు, కొత్త రైల్వే లైన్ల కోసం సర్వే లేదు,బులెట్ట్ రైల్ లేదు,హై స్పీడ్ రైలు లేదు..అసలు బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావనే లేదని ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణకు బడ్జెట్‌లో నో అనే పదం తప్ప కేటాయింపులు జరగలేదన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులే లేదు బుల్లెట్ …హై స్పీడ్ రైల్‌ ఎలా తీసుకువస్తారని ప్రశ్నించారు.

ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ,మిషన్ కాకతీయలను నీతి అయోగ్ మెచ్చుకుందని అలాంటి ప్రాజెక్టులకు 24 వేల కోట్లు ఇవ్వాలని అడిగితే కనీసం 24 రూపాయలు కూడా కేటాయించలేదని గతంలో మండిపడ్డారు కేటీఆర్.

కాళేశ్వరం లేదా పాలమూరు ఎత్తిపోథల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న కేంద్రం పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర ఆర్ధికమంత్రికి ఇంట్రెస్ట్ లేదా అని ప్రశ్నించారు.తాజాగా రైల్వేల ప్రస్తావన రాకపోవడంతో ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు కేటీఆర్.

- Advertisement -