రేపే సీఎంగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం..

505
Uddhav Thackeray
- Advertisement -

గతకొన్ని రోజులుగా ఉత్కంఠరేపుతున్న మహారాష్ట్ర రాజకీయాలకు తెరపడింది. ఎన్పీసీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. బుధవారం ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. అయితే ఇక్కడ పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. సభ ప్రారంభానికి చాలా సమయం ముందే అసెంబ్లీకి చేరుకున్న ఎన్సీపీ నేత సుప్రియా సూలే, పలువురికి ఆత్మీయ స్వాగతం పలికారు.

బీజేపీతో కలిసేందుకు సిద్ధమై, ఆపై మనసు మార్చుకున్న అజిత్ పవార్, అసెంబ్లీకి వచ్చిన వేళ, ఆయన్ను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు సుప్రియ. అలాగే, శివసేన ఎమ్మెల్యే ఆదిత్య థాకరే వద్దకు వెళ్లి పలకరించారు. ఇంకా పలువురిని పేరుపేరునా పలకరించారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో మర్యాద పూర్వకంగా కరచాలనం చేసిన ఆమె, ఎమ్మెల్యేలతో కలిసి కలివిడిగా తిరుగుతూ కనిపించారు.

Supriya Sule

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, సంకీర్ణ ప్రభుత్వంపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయని, ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకుంటామన్న నమ్మకం ఉందని అన్నారు. కాగా, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రొటెమ్ స్పీకర్ గా నిన్న బాధ్యతలు స్వీకరించిన కాళిదాస్ కొలంబ్కార్, ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

Uddhav

ఇక ముఖ్యమంత్రిగా శివసేన అధినేత, సంకీర్ణ కూటమి నాయకుడు ఉద్ధవ్ థాకరే ప్రమాణ గురువారం స్వీకారం చేయనున్నారు. అయితే, మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్‌ థాక్రే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ ఛీప్‌ అమిత్‌ షాను కూడా ఆహ్వానిస్తామని అన్నారు శివసేన కీలకనేత సంజయ్‌ రౌత్‌. ప్రమాణస్వీకారానికి తాము అందరిని పిలవాలనుకుంటున్నామని.. తమకు ఎలాంటి పట్టింపులు లేవని చెప్పారు. బీజేపీ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్‌ నేతలు, వివిధ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానాలు పంపిస్తామనన్నారు.

Newly-elected 288 MLAs are being administered the oath in the Maharashtra Assembly Wednesday by pro-tem Speaker Kalidas Kolambkar.

- Advertisement -