తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్…బీజేపీలోకి ఇద్దరు ఎంపీలు

441
Congres Bjp
- Advertisement -

త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ మరో పెద్ద షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. ఇటివలే జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తగలిన ఎదురుదెబ్బ మరువక ముందే 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఉన్న సమాచారం మేరకు మరో ఇద్దరూ ఎంపీలు పార్టీని వీడనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే వారిద్దరూ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. బీజేపీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్ వారితో ఢిల్లీలో భేటీ అయ్యారని తెలుస్తుంది. దాదాపు గంటకు పైగా వారితో చర్చించినట్లు సమాచారం.

అలాగే మరికొంత మంది నాయకులతో కూడా రాంమాధవ్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల్లో 3 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ ప్రస్తుత పరిణామాలతో ఇప్పటికిప్పుడే కోలుకునే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తో ఇటీవలే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా గల్లంతు కావడంతో అసంతృప్తులు పక్క చూపులు చూస్తున్నారు. దీంతో ఆయా నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కమలం నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

కాంగ్రెస్ లో పీసీసీ పదవి ఆశిస్తున్న ఓ ముఖ్య నేత ఆ పదవి రాదు అని తేలడంతో బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. నాయకత్వలోపంతో తెలంగాణ కాంగ్రెస్ కు కనుమరుగవుతుంది. ఇటివలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 4స్ధానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈఇద్దరు ఎంపీలను తీసుకుంటే తెలంగాణలో బీజేపీ కొంచెం బలంగా ఏర్పడవచ్చని భావిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు.

- Advertisement -