రాష్ట్రంలో మరో రెండు కొత్త డివిజన్లు..

164
telangana new divisions

తెలంగాణలో కొత్తగా మరో రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. జగిత్యాల జిల్లాలో కొత్తగా కోరుట్ల రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాలతో కోరుట్ల డివిజన్ ఏర్పాటైంది.

నాగర్ కర్నూల్ జిల్లాలో కొత్తగా కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి మండలాలతో కొల్లాపూర్ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ గురువారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇప్పటికే తెలంగాణలోని 33 జిల్లాల్లో 69 రెవెన్యూ డివిజన్లు, 585 మండలాలు ఉన్నాయి. కొత్తవాటి రాకతో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 71కి, మండలాల సంఖ్య 583కి చేరింది.