వాల్మీకితో శ్రేయాస్‌ మీడియా సైరా ..!

346
sye raa

వినూత్నంగా సినిమా ప్రచారాలు చేస్తూ దక్షిణాదిలో చిన్న నిర్మాతల నుండి పెద్ద నిర్మాతల వరకు అందరి చేత ప్రశంసలు పొందుతున్న సౌతిండియా నెం.1 ప్రచార సంస్థ శ్రేయాస్ మీడియా. తాజాగా మరో రెండు సినిమాల ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుంది. చిరు హీరోగా తెరకెక్కుతున్న సైరా,వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ని నిర్వహించనుంది శ్రేయాస్ మీడియా.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా గాంధీ జయంతి అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 18న హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది.

14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అధర్వ, పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోహీరోయిన్లుగా మాస్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న చిత్రం ‘వాల్మీకి’.షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు అతిథిగా విక్టరీ వెంకటేష్ రానున్నారు. మొత్తంగా రెండు పెద్ద సినిమా ఈవెంట్స్‌ని నిర్వహిస్తున్న శ్రేయాస్ మీడియా మరోసారి వార్తల్లో నిలిచింది.