48 గంటలు బ్యాంకులు బంద్..

219
Banks strike
- Advertisement -

ఈ నెల 30,31 నుంచి రెండురోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబిఎ) నామమాత్రంగా 2 శాతం జీతం పెంపుదలను ప్రతిపాదించడాన్ని నిరసిస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. కనీసం 5శాతం జీతాల పెంపును డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం 2శాతం మాత్రమే పెంచడానికి ఒప్పుకోవడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె జరిగి తీరుతుందంటు బ్యాంకు సంఘాల నేతలు ప్రకటించారు.

ఆల్ ఇండియా బ్యాంక్స్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ ఈ సమ్మెకి మద్దతు ప్రకటించాయి. బ్యాంకుల బంద్‌తో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మే 30, 31 తేదీల్లో పూర్తిగా లావాదేవీలు నిలిచిపోనున్నాయి. మళ్లీ బ్యాంకులు తెరుచుకునేవి శుక్రవారమే. అయితే నెలాఖరు కావటంతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

- Advertisement -