టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య పెంపు

183
ttd darshan

తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి సభ్యుల సంఖ్యను 29కి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. గతంలో 19మంది ఉన్న సభ్యుల సంఖ్యను 29కి పెంచుతూ గవర్నర్ బిశ్వభూషన్ ఉత్తర్వులు జారీ చేశారు.

నూతన పాలకమండలి సభ్యులు రేపు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు దేవాలయ పాలక మండళ్లలో రిజర్వేషన్ల అమలుకు గత అసంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా దేవాలయాల కమిటీలు, ట్రస్ట్ బోర్డుల్లో 50శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కనున్నాయి.