ఆర్టీసీ స్పెషల్ బస్సులు…కంప్లీట్ డీటైల్స్

403
tsrtc
- Advertisement -

సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఏటా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంటుంది. ఈ ఏడాది కూడా ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ అధికార యంత్రాంగం 4,940 స్పెషల్‌ బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. జూబ్లీ బస్‌స్టేషన్‌, ఎంజీబీఎస్ సహా నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలు.. ఈసీఐఎల్‌, కేపీహెచ్‌బీ, లింగంపల్లి, చందానగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌, ఎల్‌బీ నగర్‌, అమీర్‌పేట, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఈ నెల 10 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడవనున్నాయి.

సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల వైపు వెళ్లే సాధారణ బస్సులు సహా, స్పెషల్‌ బస్సులు నడుస్తాయి. ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌, ఉప్పల్‌ బస్‌స్టేషన్‌ నుంచి యాదగిరిగుట్ట, జనగాం, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్‌, తొర్రూర్‌, వరంగల్‌ వైపు వెళ్లే బస్సులు నడవనున్నాయి.

దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు వెళ్లే షెడ్యూల్‌ బస్సులు, స్పెషల్‌ బస్సుల నడవనున్నాయి. ఎంజీబీఎస్ నుంచి కర్నూలు, తిరుపతి, మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం వైపు వెళ్లే బస్సులు నడవనున్నాయి. ఎల్‌బీ నగర్ నుంచి విజయవాడ వైపు వెళ్లే బస్సులు నడిపించనున్నారు.

పండుగ వేళ నగరంలోని సిటీ బస్సుల్లో రద్దీ తగ్గుతుంది కాబట్టి, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ వంటి బస్సులను ప్రయాణీకుల సౌకర్యార్ధం ఉపయోగించనున్నారు.

- Advertisement -