కాళేశ్వరం…బ్యాంకర్లకు ఘన సన్మానం

384
cm kcr
- Advertisement -

గోదావరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పుతూ… రైతుల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మరికొద్దిగంటలు మాత్రమే మిగిలిఉంది. కాళేశ్వరం ప్రారంభోత్సవాన్ని ఊరూరా,వాడవాడలా ఘనంగా నిర్వహించేలా టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం సంబరాలు అంబరాన్నంటేలా నిర్వహించడంతో పాటు ఇంతభారీ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చిన బ్యాంకర్లను సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన భారీ నిధులను సమకూర్చడంలో బ్యాంకుల ద్వారా సేకరించిన రుణాలే కీలక పాత్ర పోషించాయి. కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా ఇప్పటివరకు రూ. 40 వేల కోట్లకు పైగా సేకరించగా, అందులోంచే ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ. 29,259 కోట్లను ఖర్చు చేశారు. సీఎం కేసీఆర్ ఆహ్వానంతో వివిధ బ్యాంకుల సీఎండీ, ఎండీలు, డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు బుధవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. వీరంతా గురువారం ఉదయం హెలికాప్టర్‌లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల ప్రాంతాల్లో పర్యటించి అక్కడి నిర్మాణాలను పరిశీలిస్తారు. శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీరికి సీఎం కేసీఆర్ ఘన సన్మానం చేయనున్నారు.

ఈ నేపథ్యంలో రుణాలిచ్చిన బ్యాంకర్లను ఘనంగా సన్మానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రా బ్యాంకు కన్సార్షియం నుంచి రూ. 7,400 కోట్లు , పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కన్సార్షియం నుంచి రూ. 11,400, పీఎఫ్‌సీ ద్వారా రూ. 18 వేల కోట్లు, నాబార్డ్‌ ద్వారా రూ. 1,500 కోట్ల మేర రుణాలు దక్కాయి. దీంతో ప్రాజెక్టు పరిధిలో ఇంతవరకు మొత్తంగా రూ. 49,877 కోట్లు ఖర్చవగా అందులో రుణాల ద్వారానే రూ. 29,259 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ. 20 వేల కోట్లు రాష్ట్ర నిధుల నుంచి ఖర్చు చేశారు.

- Advertisement -