ఢిల్లీలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు..

390
ts formation day
- Advertisement -

ఢిల్లీ తెలంగాణ భవన్ లో ప్రారంభమైన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు సాగనున్న వేడుకలు భద్రాద్రి సీతా రామ కళ్యాణం తో ప్రారంభమయ్యాయి. భద్రాద్రి వేద పండితుల ఆధ్వర్యంలో సీతా రామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ప్రతినిధులు వేణు గోపాల చారి, రామచంద్ర తెజావత్, జగన్మాథంతో పాటు అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

తెలంగాణ క‌ట్టు, బొట్టు, ఆట‌, పాట ల‌తో పాటూ సాంస్కృతిక ఉత్స‌వాల‌ను రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యంగా వీకెండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుక‌లు రావ‌డంతో తెలంగాణ ప‌ల్లే వాతావ‌ర‌ణాన్ని దేశ రాజ‌ధానిలో క‌నిపించేలా ప్ర‌త్యేక ఏర్పాటు చేశారు.

చార్మినార్ లోని లాడ్ బ‌జార్ ని త‌ల‌పించేలా, తెలంగాణ భ‌వ‌న్ లో లాడ్ బ‌జార్ ను ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, హ‌స్త‌క‌ళ‌లు, ఆహార ప‌దార్థాలతో కూడిన‌ ప్ర‌త్యేక స్టాళ్ల‌తో లాడ్ బ‌జారు ఆవిర్భావ వేడుక‌ల‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ నిలిచింది.

- Advertisement -